
మనదేశంలో 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంలో భాగస్వామ్యం కావడానికి ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తున్నట్లు అణు శక్తి కమిషన్ వెల్లడించింది.
ఈ ప్రణాళికలో భాగంగా అణు విద్యుత్ రంగంలోకి రూ.7.5 లక్షల కోట్ల మేర ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు అణు శక్తి కమిషన్ ఛైర్మన్ అజిత్ కుమార్ మొహంతి తెలిపారు.
దేశం నిర్దేశించుకున్న దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ప్రైవేటు భాగస్వామ్యం అత్యంత కీలకమని భావిస్తున్నారు.