భద్రాచలానికి చెందిన ఎస్‌బీఐ రిటైర్డ్ అధికారి డీవీ శంకరరావు అమెరికాలో జరిగిన ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటారు.
ఈ నెల 22న జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్‌లో రజతం, ఈ నెల 15న క్లాసిక్‌లో కాంస్యం గెలుచుకున్నారు.
గుండె బైపాస్ సర్జరీ జరిగినా, 73 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించి ఆయన స్ఫూర్తిగా నిలిచారు.