
పాతబస్తీకి చెందిన కొండబత్తుల పవన్ కుమార్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి, ప్రేమ పేరుతో యువకులను ట్రాప్ చేసి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు.
ఓ బాధితుడి నుంచి ఇప్పటికే రూ. 18 లక్షలు వసూలు చేయగా, అదనంగా మరో రూ. 7.16 లక్షలు ఇవ్వాలంటూ వేధించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
నిందితుడి వద్ద 82 మందికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు, 13 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్, 14 ఫేక్‌బుక్ ఖాతాలను గుర్తించిన పోలీసులు ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.