
డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోతోందని నటి కాజల్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాము వ్యక్తిగత జీవితంలో వారానికి ఒకరోజు ఫోన్లను పక్కనపెట్టి కేవలం మాట్లాడుకోవడానికి సమయం కేటాయిస్తామని ఆమె తెలిపారు.
ఈ నిబంధన భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని మరింత బలపడటానికి ఎంతగానో సహాయపడుతుందని కాజల్ పేర్కొన్నారు.