
ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా 'ఓట్ల చోరీ' జరుగుతోందని ఆరోపిస్తూ ఇండియా కూటమి అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో 20 పార్టీల అగ్రనేతలు పాల్గొని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేశారు.
అక్టోబరు 2 నుంచి 8 వరకు ప్రతి జిల్లాలో 'సంవిధాన్ బచావో' పాదయాత్రలు నిర్వహించడంతో పాటు అక్టోబరు 6న సీఈసీ కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీలు మార్చ్ చేపట్టనున్నారు.