
ఐక్యరాజ్య సమితి సమావేశాలకు న్యూయార్క్‌కు వెళ్లిన సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తన ప్రసంగానికి ముందు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టా రీల్స్ చూస్తూ కెమెరాకు చిక్కారు.
తుర్కియే అధ్యక్షుడు ప్రసంగిస్తున్న సమయంలో ఆయన రీల్స్ చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అల్ ఖైదా మాజీ సభ్యుడైన అహ్మద్ అల్ షరా 2024లో తిరుగుబాటు ద్వారా సిరియా అధ్యక్షుడిగా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.