
పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లలో పబ్లిక్ వైఫైని ఉపయోగించేటప్పుడు ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.
ప్రయాణికులు హోటల్ వైఫై నెట్‌వర్క్‌లను వాడేటప్పుడు సైబర్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అపరిచిత వైఫై కనెక్షన్ల ద్వారా వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.