
ఝార్ఖండ్‌లో JPSC, JSSC-CGL పరీక్షల పేపర్ లీక్‌లపై సీబీఐ విచారణ, పరీక్షల రద్దు కోరుతూ విద్యార్థులు గత ఐదు రోజులుగా రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్నారు.
విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఏప్రిల్ 19న జరిగిన 14వ JPSC ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని, TDPL ఏజెన్సీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి ఆమరణ దీక్షకు దిగారు.
రాంచీ పోలీసులు టెంట్లు వేసుకోవడానికి అనుమతించకపోవడంతో, ఝార్ఖండ్‌లోని 24 జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులు వర్షంలోనే నిరసన కొనసాగిస్తూ, ప్రభుత్వం దిగిరాకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.