
మాదాపూర్లోని అర్క బ్రాంకోమ్ సొల్యూషన్స్ పేరుతో అన్వేష్ అనే వ్యక్తి ఐటీ ఉద్యోగాల పేరుతో సుమారు 20 మంది నిరుద్యోగుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశాడు.
ఆఫీస్ రినోవేషన్ సాకుతో వర్క్ ఫ్రమ్ హోమ్ అని నమ్మించి, ఆ తర్వాత కార్యాలయాన్ని మూసివేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
నిందితుడు అన్వేష్ గతంలో 13 మంది మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేసిన కేసులో 2022 జులైలో గచ్చిబౌలి పోలీసులచే అరెస్ట్ అయ్యాడని దర్యాప్తులో తేలింది.