
విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో 13,000 మంది గిరిజన విద్యార్థినులు, మహిళలు థింసా నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం పలకడానికి ఈ ప్రదర్శన రిహార్సల్ నిర్వహించారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకున్నారు, ఆమె కూడా గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు.