
ఒక రెస్టారెంట్లో అసంపూర్ణంగా ఉన్న భారత చిత్రపటాన్ని చూసి బాక్సర్ లవ్లీనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
దేశభక్తిని చాటుతూ ఆమె తీసుకున్న నిర్ణయం సామాన్యమైనది కాదని, యువతకు స్ఫూర్తిదాయకమని ప్రధాని కొనియాడారు.
ఈ ఘటనపై లవ్లీనా స్పందిస్తూ, దేశం పట్ల గౌరవం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.