
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో తయారైన 'అదమ్య' క్లాస్ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ 'ఐసీజీఎస్ అజిత్' నౌకను అక్టోబర్ 9న అధికారికంగా సేవల్లోకి తీసుకువచ్చారు.
52 మీటర్ల పొడవు, 320 టన్నుల బరువున్న ఈ నౌక నిర్మాణంలో 60 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను వినియోగించారు.
సముద్ర నిఘా, అక్రమ రవాణా నిరోధం, సెర్చ్ అండ్ రెస్క్యూ బాధ్యతల కోసం ఈ నౌకను భారత తీరరక్షక దళం ఉపయోగించనుంది.