ఆర్బీఐ అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా వర్గీకరించిన టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాల్సి ఉండగా, దీనిపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో ఐపీఓకు వెళ్లాల్సి వస్తే సెబీ నిబంధనలకు అనుగుణంగా బోర్డు నియామకాలు, స్వతంత్ర డైరెక్టర్ల పాత్రపై కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో మార్పులపై కసరత్తు జరుగుతోంది.
టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు సుమారు 66 శాతం వాటా ఉండటంతో పాటు బోర్డులో ప్రత్యేక హక్కులు కొనసాగుతున్నాయి.