
విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్ అని, దీనిని భోజనం చేసే సమయంలో తీసుకోవడం వల్ల శరీరం సమర్థవంతంగా గ్రహిస్తుందని డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ తెలిపారు.
పౌడర్ రూపంలో ఉండే విటమిన్ డి సాచెట్లను నీటిలో కాకుండా ఒక గ్లాసు పాలతో కలిపి తీసుకోవడం అత్యుత్తమమని ఆమె సూచించారు.
శరీరంలో కాల్షియం సమృద్ధిగా ఉంటే విటమిన్ డి శోషణ మెరుగ్గా ఉంటుందని, ఎముకల దృఢత్వానికి ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు.