
తుక్కుగూడలోని ఆస్పత్రిలో నర్సును హత్య చేసిన కేసులో బిహార్‌కు చెందిన 35 ఏళ్ల సైనా ఉల్లాను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు కిటికీ గ్రిల్ ద్వారా గదిలోకి ప్రవేశించి అత్యాచారయత్నం చేయగా, బాధితురాలు ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
గత ఎనిమిది నెలలుగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు ఆదివారం విధులకు రాకపోవడంతో, సిబ్బంది గదిని పరిశీలించగా మృతదేహం బయటపడింది.