
పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ మరియు టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ యాడ్స్ 2006 ఎఫ్ఎస్ఎస్ఐ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎఫ్‌డీఏ ఆదేశించింది.
నిబంధనలు పాటించని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఏ హెచ్చరించింది.