అమెరికా వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఆశ్రయించిన గుజరాత్ మెహసానా జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇథియోపియాలో కిడ్నాప్‌నకు గురయ్యారు.
మమతా చద్వా, రుత్విక్ జన్సారీ, మయూరీ సోలంకీలు ట్రాఫికింగ్ ఏజెంట్లతో ఒప్పందం చేసుకుని అబుధాబి మీదుగా ఇథియోపియాకు చేరుకోగా, వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి.
బాధితుల ప్రాణాలు దక్కాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తుండటంతో, కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరారు.