నాగర్‌కర్నూల్ జిల్లాలో డెంగీ బారినపడి తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వాతావరణ మార్పులు, వర్షాల కారణంగా ఏడిస్ దోమల వృద్ధి చెంది డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.