
అమరావతిని గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 45,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో 'క్వాంటం వ్యాలీ' భవనాన్ని నిర్మిస్తోంది.
ఐబీఎం, టీసీఎస్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ ల్యాబ్‌లో మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు క్రయోజెనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
సెప్టెంబర్ 15 నాటికి అంతర్గత పనుల కోసం ఈ భవనాన్ని ఐబీఎంకు అప్పగించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.