
ఢిల్లీలోని షాదరా జిల్లా కృష్ణానగర్‌లోని ప్రభుత్వ సర్వోదయ కన్యా విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని పాఠశాల ఆవరణలోనే ఒంటికి నిప్పు అంటించుకుంది.
తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు శనివారం పోలీసులు ధ్రువీకరించారు.
ఘటనా స్థలంలో లభించిన మూడు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.