
నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో కల్తీ మద్యంగా అనుమానిస్తున్న ద్రవాన్ని తాగి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు గురువారం తెలిపారు.
మొత్తం 182 మంది ఈ ఘటనతో ప్రభావితమైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బాంజీ అజాకా తెలిపారు. ఒడిగ్బో, ఇరెలె ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పానీయంలో ప్రాణాంతక మెథనాల్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.