ఇటలీకి చెందిన కార్ డిజైన్ సంస్థ పినిన్‌ఫారినాలో తన వాటాను 92.59 శాతానికి పెంచుకునేందుకు టెక్ మహీంద్రా ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఆల్ క్యాష్ డీల్ కోసం కంపెనీ గరిష్ఠంగా 9.46 మిలియన్ యూరోలను చెల్లించనుండగా, ఇది భారత కరెన్సీలో రూ. 100 కోట్ల వరకు విలువ చేస్తుంది.
2026 డిసెంబర్ 31 నాటికి ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.