
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం లోయర్ మాన్హటన్ సబ్వే స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో భారత సంతతి యువతి మలైకా చిత్రె, నేపాల్ సంతతి యువకుడు నవం కౌల్ ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్లాట్‌ఫాంపై కూర్చున్న నవం కౌల్ కిందపడగా, అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన మలైకా చిత్రె కూడా కిందకు దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటన సమయంలో రైలులో 100 మంది ప్రయాణికులు ఉండగా, ప్రమాదం తర్వాత వారిని ఖాళీ చేయించారు మరియు మృతదేహాలను పోలీసులు రికవరీ చేశారు.