
భవిష్యత్తులో సౌదీ అరేబియా అణ్వాయుధాలను అభివృద్ధి చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేశాయి.
అమెరికా కాంగ్రెస్కు అందించిన రహస్య పత్రాలలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది.
పౌర అవసరాల కోసం సౌదీకి యురేనియం ఇచ్చేందుకు ఇటీవల 30 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదిరినప్పటికీ, దీనిపై చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.