ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్న ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు త్రిసభ్య కమిటీ ముందు వివరణ ఇచ్చారు.
పార్టీ ఆదేశాలను తాను ఎప్పుడూ అతిక్రమించలేదని, జరిగిన విషయాన్ని దుష్టశక్తులు వక్రీకరించి ప్రచారం చేశాయని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో పార్టీ లైన్ దాటబోనని స్పష్టం చేసిన బొండా ఉమా, త్వరలోనే చంద్రబాబు, నారా లోకేశ్‌లను కలుస్తానని వెల్లడించారు.