
తెలంగాణలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం, పథకాల కొనసాగింపునకు మార్గం సుగమం చేసింది.
ప్రస్తుతానికి స్టే మాత్రమే తొలగించిన కోర్టు, పథకాల చట్టబద్ధతపై దాఖలైన ప్రధాన పిటిషన్పై తదుపరి విచారణను కొనసాగించనుంది.