తెలంగాణలో పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ముద్రించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
కేంద్రం అందిస్తున్న 5 కిలోల బియ్యానికి గుర్తింపుగా ప్రధాని ఫొటో ఉండాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్న 1.06 కోట్ల కార్డుల ఖర్చు, టెండర్ల వివరాలను బహిర్గతం చేయాలని రఘునందన్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.