
ఏపీలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాబోయే గంటల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎల్‌నినో ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయని, ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు.