
ఉక్రెయిన్లోని ఖేర్సన్ ప్రాంతంలో రష్యా సైన్యం డ్రోన్లను ఉపయోగించి పౌరులను వేటాడుతోందని అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు.
రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్న వ్యాపారిపై రష్యా డ్రోన్ దాడి చేసిన వీడియోను జెలెన్స్కీ విడుదల చేయగా, అందులో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే ఈ డ్రోన్లను రష్యా సైనికులు పౌరులను చంపడానికి ఉపయోగిస్తున్నారని, ఇది అమానవీయ యుద్ధ నేరమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అంద్రి సిబిహ పేర్కొన్నారు.