
నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు ఎస్‌బీఐ నాయకత్వంలోని కొన్ని బ్యాంకులు 350 కోట్ల డాలర్ల (సుమారు రూ.33,425 కోట్లు) రుణ సాయం అందించేందుకు అంగీకరించాయి.
పదేళ్లలో చెల్లించే ఈ రుణానికి కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా కొనసాగాలని, రుణ చెల్లింపులకు హామీ ఇవ్వాలని బ్యాంకులు షరతు విధించాయి.
ఈ రుణ మొత్తాన్ని నెట్‌వర్క్ విస్తరణకు ఉపయోగించి ఇతర టెకాం దిగ్గజాలతో పోటీపడాలని వొడాఫోన్ భావిస్తోంది.