
అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా 2028 అక్టోబర్ నాటికి దేశీయ డిజైన్ మరియు తయారీతో సొంత బ్రాండ్ స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్ అభివృద్ధిలో భాగంగా దేశీయ కంపెనీలు ఇప్పటికే ఒక 5జీ మొబైల్‌ను రూపొందించాయని వెల్లడించారు.
ఈ స్వదేశీ బ్రాండ్ల ఆవిర్భావం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగాలు మరియు వ్యాపార అవకాశాలు మరింత వృద్ధి చెందుతాయని మంత్రి పేర్కొన్నారు.