
ఇరాన్ దేశం తన దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లో 7.5 ట్రిలియన్ ఘనపుటడుగుల సహజ వాయువు నిల్వలను తాజాగా కనుగొన్నట్లు చమురుశాఖ మంత్రి మొహసెన్ పక్నెజాద్ ప్రకటించారు.
కొత్తగా కనుగొన్న ఈ నిల్వలలో 5.7 ట్రిలియన్ ఘనపుటడుగుల వాయువును వెలికితీయవచ్చని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంలో 15 ఏళ్ల ఉత్పత్తికి సమానమని తెలిపారు.
అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరిగిన యుద్ధం కారణంగా ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని నెలల తర్వాత ఇరాన్‌కు ఈ భారీ గ్యాస్ క్షేత్రం దక్కడం గమనార్హం.