
ముంబైలోని సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద భద్రతా విధుల్లో ఉన్న 41 ఏళ్ల కానిస్టేబుల్ గణేష్ శనివారం మరణించారు.
డ్యూటీలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన గణేష్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రాథమిక దర్యాప్తులో గుండెపోటు కారణంగానే కానిస్టేబుల్ మరణించినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.