
విజయవాడలో రూ.179.50 కోట్ల విలువైన సిగ్నలింగ్ ప్రాజెక్టులో బోనస్ మంజూరు కోసం రూ.15 లక్షల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజును సీబీఐ అరెస్ట్ చేసింది.
ఈ కేసులో ఇంజినీర్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్‌ను కూడా అదుపులోకి తీసుకున్న అధికారులు, నిందితులను ఆగస్టు 17న విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
లంచం వ్యవహారంలో ఫైల్ తేదీలను మార్చినట్లు గుర్తించిన సీబీఐ, విజయవాడ, విశాఖపట్నం, పిఠాపురం, హైదరాబాద్‌లోని నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది.