
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా మూడో ర్యాంక్ సాధించారు.
ఢిల్లీలోని మిరాండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదువుతూ రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పక్కా ప్రణాళికతో ఆమె ప్రిపరేషన్ కొనసాగించారు.
క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆలోచనా విధానం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, సమాజ సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.