
యూపీఐ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు, జీఎస్టీ విధిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్తోపాటు పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల డీలర్లు హెచ్చరికలు జారీ చేశారు.
రూ.2000 కంటే ఎక్కువ ఇంధనం కొనుగోలు చేస్తే యూపీఐ చెల్లింపులు స్వీకరించమని, కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని వారు తేల్చి చెబుతున్నారు.
అక్టోబర్ 15 నుంచి ఎండీఆర్ ఛార్జీలు అమల్లోకి రానుండటంతో నిర్వహణ భారమవుతుందని ఆల్ ఇండియా పెట్రోల్ పంప్ డీలర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది.