
బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
ప్రస్తుతం సినిమా ప్రథమార్ధం చిత్రీకరణ పూర్తయిందని, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటాయని చిత్రబృందం పేర్కొంది.
ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.