
ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న పాకిస్థాన్ అండర్-19 క్రికెటర్లను అక్రమ శరణార్థులుగా పొరబడిన స్థానికులు ఆందోళనకు దిగారు.
పోర్ట్స్మౌత్లోని హోటల్ వెలుపల జరిగిన ఈ ఘటనతో పాక్ క్రికెట్ జట్టుకు తీవ్ర ఉద్రిక్తత ఎదురైంది.
శరణార్థులని భావించి నిరసనకారులు ఆందోళన చేయడంతో ఈ వ్యవహారం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.