
హరియాణాలోని గురుగ్రామ్ సెక్టార్ 68లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొహమ్మద్ అస్లాం తన భార్య ఫర్హానాను గొంతు నులిమి హత్య చేసి తాను ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అక్టోబర్ 15న ఉదయం అస్లాం తన కంపెనీ సీనియర్ అధికారులకు ఈమెయిల్ ద్వారా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం అందించాడు.
కంపెనీ అధికారుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి చూడగా, అక్కడ సూసైడ్ నోట్తో పాటు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.