
కేంద్ర విద్యుత్ సంస్థ (CEA) నిబంధనల ప్రకారం, 2027 జూలై నుంచి సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లు 10% సామర్థ్యంతో 2 గంటల బ్యాటరీ స్టోరేజీని ఏర్పాటు చేసుకోవాలి.
రెండో దశలో భాగంగా 2029 జూలై నుంచి ఈ నిబంధనను 4 గంటల స్టోరేజీకి పెంచారు, అలాగే 15% ఇన్వర్టర్లకు గ్రిడ్ ఫార్మింగ్ టెక్నాలజీ ఉండాలని స్పష్టం చేశారు.
2030 నాటికి 250 గిగావాట్ అవర్ స్టోరేజీని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఈ నిబంధనలతో ప్రాజెక్టుల వ్యయం 40% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.