
రాజమండ్రిలో ఈ నెల 3న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ ఘటనకు సంబంధించి సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్‌లను పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
ప్రమాదం జరిగిన ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన ప్రియాంకను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.