
టీవీ సీరియల్స్ తో మొదలుపెట్టి, 'కేజీఎఫ్' చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్ (నవీన్ కుమార్ గౌడ) జీవిత ప్రస్థానం 'టాక్సిక్' విడుదల సందర్భంగా చర్చనీయాంశమైంది.
యశ్ తండ్రి అరుణ్ కుమార్ బెంగళూరులో బీఎంటీసీ బస్సు డ్రైవర్ గా పనిచేయగా, యశ్ రంగస్థల నటులకు టీలు అందిస్తూ రోజుకు రూ.50 సంపాదించేవారు.
2007లో 'జంబద హుడుగి'తో తొలి సినిమా చేసి, 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి', 'కేజీఎఫ్: చాప్టర్ 1' చిత్రాలతో ఉత్తమ నటుడి అవార్డులు గెలుచుకున్నారు.