
న్యూజిలాండ్-ఎ తో జరుగుతున్న మూడో అనధికార టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిశాడు.
జైస్వాల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు సాధించి జట్టుకు మంచి పునాది వేయడంలో సహకరించాడు.
శనివారం తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్-ఎ జట్టు 2 వికెట్ల నష్టానికి 227 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది.