
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ఏకే-47 తుపాకులతో కాల్పులు జరిపారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
బీహార్లో యువతపై కాల్పులు, ఢిల్లీలో పెల్లెట్ గన్ల వినియోగంపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై జరిగిన ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.