బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనిపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.