
సికింద్రాబాద్ బొల్లారంలోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.
గత మూడు నెలలుగా జరిగిన ఈ చోరీలో 12 అత్యాధునిక ఆయుధాలు, సుమారు 2 వేల రౌండ్ల బుల్లెట్లు మాయమయ్యాయని విచారణలో వెల్లడైంది.
నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించగా, ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.