వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రం నుండి హీరో చిట్టిబాబు పాత్రను పరిచయం చేస్తూ సోమవారం గ్లింప్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో వెంకటేష్ భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.