
రోజువారీ నిద్ర గంటా 20 నిమిషాల వరకు తగ్గితే ఆరు వారాల్లో సగటున 450 గ్రాముల బరువు పెరుగుతారని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
20 ఏళ్లు పైబడిన 95 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో, నిద్ర తగ్గినవారు శారీరకంగా తక్కువగా కదిలినట్లు గుర్తించారు.
దీర్ఘకాలంలో ఈ అలవాటు పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.