
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ఐపీఓ ద్వారా ఎస్బీఐ 0.65 శాతం, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ 0.35 శాతం వాటాను విక్రయించనున్నాయి.
ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్బీఐకి 3.23 శాతం, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు 4.33 శాతం వాటా ఉన్నట్లు చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
హౌసింగ్ రుణాల విభాగంలో తమ మార్ట్గేజ్ పోర్ట్‌ఫోలియో ఈ త్రైమాసికంలో రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.