
తుఫాన్, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు, ఓం టర్నింగ్, టోల్ గేట్ వద్ద కీలక ప్రాంతాలను ఈవో వి.కె.శీనా నాయక్ పరిశీలించారు.
వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ మార్గాలను పరిశీలించి, పూడిక తొలగించాలని, కొండచరియలు జారే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.